కలుషితాహారంతో 75 మందికి అస్వస్థత

Guntur Junior College For Women Students Get Illness Due To Food Poison - Sakshi

గుంటూరు జీజీహెచ్‌లో 

చికిత్స పొందుతున్న విద్యార్థినులు

గుంటూరు ఈస్ట్‌: గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో కల్తీ ఆహారం తిని సోమవారం 75 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. హాస్టల్‌లో డిగ్రీ విద్యారి్థనులు 400 మంది, ఇంటర్‌ విద్యారి్థనులు 283 మంది ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం అన్నం, చికెన్‌ కూర తిన్నారు. రాత్రికి పదిమంది స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో జీజీహెచ్‌కు వెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం హాస్టల్‌కు వచ్చారు. ఉదయం అల్పాహారంగా ఊతప్పం తిన్న అనంతరం విద్యారి్థనులు వరుసగా అస్వస్థతకు గురికావడంతో జీజీహెచ్‌లో చేరి్పంచారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.బాబులాల్‌ మాట్లాడుతూ ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే షేక్‌ మొహ్మద్‌ ముస్తఫా, వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్‌లో విద్యారి్థనులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. విద్యారి్థనులతో కలిసి భోజనం చేశారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యారి్థనుల సంఖ్య పెరుగుతూ రాత్రికి 75కు చేరింది. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా మళ్లీ జీజీహెచ్‌కు చేరుకుని సమీక్షించారు. అత్యవసర విభాగానికి ముందు వైపు ఉన్న హాల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించారు. రాత్రి జీజీహెచ్‌లోనే బసచేశారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top