పెరిగిన పుష్కర భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

పెరిగిన పుష్కర భక్తుల రద్దీ

Published Fri, Jul 24 2015 1:48 AM

Grew up in the rush of devotees Pushkarni

శ్రీకాకుళం అర్బన్: గోదావరి పుష్కరాల కోసం ఆఖరు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో జిల్లాలోని భక్తులంతా గోదావరి వైపే పయనిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ భక్తులతో గురువారం కిక్కిరిసింది. ఇప్పటికే జిల్లాలోని చాలామంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. మిగిలిన వారు కూడా కుటుంబాలతో సహా పుష్కర స్నానాలకు బయలుదేరుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగానే ఆర్టీసీ అధికారులు బస్సులను నడుపుతున్నారు. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల నుంచి బస్ సర్వీసులు వేశారు. భక్తులను క్యూలో నిల్చొబెట్టి ప్రతి 15 నిముషాలకు ఒక ఆర్టీసీ బస్సును పెట్టి భక్తులను తరలిస్తున్నారు. భక్తుల రద్దీ గత మూడు రోజులుగా ఉదయం వేళల్లో కాస్తా తక్కువగా ఉన్నా, సాయంత్రం అయ్యేసరికి అమాంతం పెరుగుతోంది. కాంప్లెక్స్‌లో పుష్కర సందడి కనిపిస్తోంది.
 
 రద్దీ ఎక్కువగా ఉండవచ్చు
 గోదావరి పుష్కరాల గడువు ముగుస్తున్న కొద్దీ చివరి రెండు రోజులూ అధిక సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణికులకు తగ్గట్లుగానే ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. ఈరద్దీ ఇంకా ఎక్కువగా ఉంటే ముందుగా విశాఖపట్టణం తరలించి అక్కడ నుంచి రాజమండ్రికి పంపుతున్నాం.               
  శ్రీనివాసరావు, ఆర్టీసీ డీసీటీఎం
 

Advertisement
Advertisement