నిప్పంటించడంతో 80 మేకలు మృత్యువాత | goats killed in barn fire | Sakshi
Sakshi News home page

నిప్పంటించడంతో 80 మేకలు మృత్యువాత

Nov 15 2015 12:52 PM | Updated on Sep 5 2018 9:45 PM

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 80 మేకలు మృత్యువాతపడ్డాయి.

వైఎస్సార్ జిల్లా: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 80 మేకలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం సి.వడ్డెపల్లిలో ఆదివారం జరిగింది.

గంగమ్మ అనే మహిళ మేకల పెంపకంతో జీవనం సాగిస్తోంది. సుమారు 80 మేకలు ఇంటి దగ్గర కొట్టంలో ఉండగా.. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలకు 80 మేకలు మృతి చెందాయి. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ ప్రభాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లిటినట్టు బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement