టెట్‌ పరీక్షపై స్పందించిన గంటా

Ganta Srinivasa Rao Responds on TET Exam - Sakshi

సాక్షి, అమరావతి: టెట్‌ వ్యాయామ పరీక్షపై సామాజిక ప్రసార మాద్యమాల్లో వస్తున్న వార్తలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. టెట్‌ పరీక్ష పేపర్‌ లీకులపై వస్తున్న వార్తలను నమ్మకండని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. యధావిధిగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఈ నెల 19వ తేదీన టెట్‌ వ్యాయామ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. 

ఆన్‌లైన్‌లో పరీక్షా పశ్నా పత్రం లీకులకు అవకాశమే లేదని గంటా పేర్కొన్నారు. అన్‌లైన్‌ సెంటర్‌లోనూ పరీక్షకు ముందు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రశ్నాపత్రం అందుబాటులోకి వస్తుందని గుర్తుచేశారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష పటిష్టంగా నిర్వహిస్తామని తెలిపారు. 

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌లో సెక్రటరీకి డిప్యూటేషన్‌పై సహాయకుడిగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు తేళ్ల వంశీకృష్ణను సస్పెండ్‌ చేయాలని గంటా పాఠశాల విద్యా కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వంశీకృష్ణ అర్హత లేకపోయినా టెట్‌ వ్యాయమ పరీక్షకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఆయన అభ్యర్థులకు ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో తమ కోచింగ్‌ సెంటర్‌లోని అభ్యర్థులను గట్టెక్కించేందుకు టెట్‌కు దరఖాస్తు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వంశీకృష్ణను సస్పెండ్‌ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top