పాడేరులో 100 కిలోల గంజాయి పట్టివేత | ganja caught in paderu vishaka district | Sakshi
Sakshi News home page

పాడేరులో 100 కిలోల గంజాయి పట్టివేత

Jan 28 2016 11:07 AM | Updated on Sep 3 2017 4:29 PM

విశాఖ జిల్లా పాడేరు సమీపంలో గురువారం ఉదయం ప్రమాదానికి గురైన ఓ కారు నుంచి సుమారు వంద కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు సమీపంలో గురువారం ఉదయం ప్రమాదానికి గురైన ఓ కారు నుంచి సుమారు వంద కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు సమీపంలోని మోదకొండమ్మ పాదాలు గుడి వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని హోండా కారు రోడ్డు పక్క గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారును వెలికి తీసి చూడగా డిక్కీలో ఉంచిన క్వింటా బరువైన గంజాయి సంచులు బయటపడ్డాయి. కారు నెంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement