సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో, స్వామిభక్తిని ప్రదర్శించడంలో మిగతా మంత్రులందర్నీ రావెల కిశోర్‌బాబు మించిపోయారు.
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో, స్వామిభక్తిని ప్రదర్శించడంలో మిగతా మంత్రులందర్నీ రావెల కిశోర్‌బాబు మించిపోయారు. రాష్ట్ర స్థాయి సంక్రాంతి వేడుకలను ఇందుకు వేదిక చేసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సంక్రాంతి సంబరాలు జరిగాయి.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నాలుగు చరణాలతో కూడిన ఓ పాట రాసి ఓ బాలికతో పాడించారు. ఈ పాటలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. పాట విన్న ముఖ్యమంత్రి తనలో తాను మురిసిపోయారు. పాటను ఫ్రేమ్ కట్టించి సీఎంకు మంత్రి రావెల అందించారు. ఈ తతంగం చూసిన మిగిలిన మంత్రులు విస్తుపోయారు.