ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం | fire accident in fancy store in hindupuram | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం

Apr 13 2015 8:24 AM | Updated on Sep 5 2018 9:45 PM

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

అనంతపురం: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్యాన్సీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. వివరాలు..పట్టణంలో మెయిన్ రోడ్‌లో ఉన్న ఎస్‌ఎన్ ఫ్యాన్సీ దుకాణంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సుమారు 80 శాతం వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

 

విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని దుకాణ యజమాని తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement