విత్తనం దొరక్క అగచాట్లు | farmers facing problems to not available seeds | Sakshi
Sakshi News home page

విత్తనం దొరక్క అగచాట్లు

Dec 13 2013 12:41 AM | Updated on May 24 2018 1:51 PM

వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా నష్టపోరుున రైతులకు వరి విత్తనాల కొరత, వాటి ధరలు గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణమించారుు.

పాలకొల్లు, న్యూస్‌లైన్ : వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా నష్టపోరుున రైతులకు వరి విత్తనాల కొరత, వాటి ధరలు గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణమించారుు. రైతులే స్వయంగా విత్తనాలు పండించుకున్న చేలు నీటమునగడం, దుబ్బులు నీటనాని కుళ్లిపోవడంతో దాళ్వా విత్తనాల కోసం ఏపీ సీడ్స్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో ఈ దాళ్వాలో 4లక్షల 86 వేల 250 ఎకరాల్లో వరి పండించాల్సి ఉంది. ఇందుకోసం వేసే నారుమడుల్లోకి 90 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 55వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులే పండించుకుంటారని అంచనా.

ఈ దృష్ట్యా 35 వేల క్వింటాళ్లను ఏపీ సీడ్స్ ద్వారా అందుబాటులోకి తెస్తే సరిపోతుందని నిర్ణరుుంచిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ మేరకు విత్తనాలను సిద్ధం చేయూలని నివేదించారు. ఇప్పటివరకూ సుమారు 6 వేల క్వింటా ళ్లను సొసైటీలు, లెసైన్స్ పొందిన వ్యాపార సంస్థలకు కేటారుుంచారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రైతులు స్వయంగా 55 వేల క్వింటాళ్ల విత్తనాలను పండించాల్సి ఉండగా, విత్తన పంట నీటమునిగి పనికిరాకుండా పోవడంతో విత్తనాల కొరత ఏర్పడింది.
 సొంత విత్తనాలపైనే మక్కువ ఎక్కువ జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు దాళ్వాకు అవరసమైన వరి విత్తనాలను సార్వాలో పండించుకోవడం ఆనవాయితీ. సొంతంగా పండించుకున్న విత్తనాలైతే నాణ్యం గా ఉంటారుు.

అందులో కేళీలు ఉండవు. మొలక శాతంలోనూ ఇబ్బంది తలెత్తతు. ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది. ఈ కారణంగానే సార్వా సమయంలోనే రైతులు ఎంటీయూ 1010, ఎంటీయూ 1001, ఐఆర్-64 రకాలను విత్తన పంటగా సాగు చేస్తారు. పండించిన విత్తనాలు సొంత అవసరాలకు ఉపయోగించుకోగా.. మిగిలిన విత్తనాలను పొరుగు రైతులకు విక్రరుుస్తుం టారు. కొందరైతే కేవలం విత్తనాల కోసం మాత్రమే పంటను సాగు చేస్తుంటారు. అరుుతే,ఈ ఏడాది సార్వా సీజన్ ప్రారంభంలో కాలువలకు సాగునీరు ఆలస్యంగా విడుదల చేశారు. దీనివల్ల నాట్లు వేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తరువాత కురిసిన భారీ వ ర్షాలు, తుపానుల కారణంగా విత్తన రకం పంట నేలకొరిగి నీటమునిగింది. ఈ పరిస్థితుల్లో రైతులంతా విత్తనాల కోసం ప్రభుత్వ సంస్థ అరుున ఏపీ సీడ్స్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 సకాలంలో నాట్లు వేయకపోతే నష్టమే..
 రైతులకు సార్వా పంట చేతికి రాలేదు. మరోవైపు త్వరితగతిన దాళ్వా నాట్లు పూర్తిచేయాలని అధికారుల నుంచి ైఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో సాగునీటి సమస్య తలెత్తే ప్రమా దం ఉంది. ఈ ఏడాది కాలువలను ముందుగానే కట్టేసేందుకు నిర్ణరుుంచిన నేపథ్యంలో రైతులు ముందుగా నారుమళ్లు వేసి, నాట్లు పూర్తి చేయూలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఒకపక్క సార్వా మాసూళ్లు పూర్తికాలేదు, మరోవైపు విత్తనాలు దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏంచేయూలో దిక్కుతోచక అన్నదాతలు అల్లాడుతున్నారు.
 కొరత రానివ్వం
 దాళ్వాకు విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ జారుుంట్ డెరైక్టర్ వీడీవీ కృపాదాస్ చెప్పారు. విత్తన కొరతపై ‘న్యూస్‌లైన్’ ఆయనను సంప్రదించగా... 35 వేల క్వింటాళ్ల విత్తనాల కోసం ఏపీ సీడ్స్‌కు లేఖ రాశామని చెప్పారు. ఇప్పటికే సుమారు 6వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. అవసరమైనన్ని విత్తనాలను రప్పిస్తామని, రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement