కరెంట్‌ షాక్‌తో రైతు మృతి | farmer die due to current shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

Mar 8 2017 6:32 PM | Updated on Oct 1 2018 4:01 PM

కిందికి వేలాడుతున్న కరెంటు తీగ పొలానికి వెళ్లిన రైతు ప్రాణం తీసింది.

బొల్లాపల్లి(గుంటూరు): కిందికి వేలాడుతున్న కరెంటు తీగ పొలానికి వెళ్లిన రైతు ప్రాణం తీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం  బోడిపాలెం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తె తండాకు చెందిన బాణావత్‌ చిన్నానాయక్‌(45) మంగళవారం రాత్రి పొలానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో పల్లెపోగు పెద్దయ్య పొలం వద్ద అడ్డంగా పడి ఉన్న విద్యుత్‌ తీగలను అతడు గమనించలేదు. నడిచి వెళ్తున్న చిన్నానాయక్‌కు ఆ తీగలు తగలటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆ పొలానికి చెందిన వారు చిన్నానాయక్‌ మృతదేహాన్ని వేరే చోటికి తరలించి ఖననం చేశారు.  బుధవారం ఈ విషయం తెలిసింది. దీంతో చిన్నానాయక్‌ కుమారుడు రమేష్‌ నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మృతునికి భార్య మోతీభాయి, ఐదుగురు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement