పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి యువరైతు ఆత్మహత్య

Nov 2 2015 1:52 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల భారంతో గుంటూరు జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల భారం మరో యువ రైతును బలితీసుకుంది.ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం రామిడి చర్లలో సోమవారం చోటు చేసుకుంది. రామిడి చర్లకు చెందిన మన్నేపల్లి (26) అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతాళలేకే ఊరి చివరన ఉన్న పొలంలో మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement