ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతుల గందరగోళం | exise canistable promotions not fair in andhrapradesh | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతుల గందరగోళం

Jun 30 2019 5:48 PM | Updated on Jun 30 2019 7:28 PM

exise canistable promotions not fair in andhrapradesh - Sakshi

కృష్ణా : రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రమోషన్ల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా 20 నుంచి 30 ఏళ్ల లోపు సర్వీస్‌ ఉన్నవారికి పదోన్నతులు ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ .. ఆధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రోస్టర్‌ పేరుతో తక్కువ కాలం సర్వీస్‌ ఉన్నా.. పలువురికి ప్రమోషన్లు ఇస్తున్నారని అధికారులను విమర్శించారు. 610 జీవో పరిధిలోకి వచ్చే వారికి సరిపడ పదోన్నతులు వర్తింపచేయాలన్నారు. ప్రమోషన్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement