సింగరేణి కీర్తిని చాటాలి | every one says singareni great | Sakshi
Sakshi News home page

సింగరేణి కీర్తిని చాటాలి

Feb 18 2014 2:52 AM | Updated on Sep 2 2018 4:16 PM

సింగరేణి కీర్తిని చాటాలి - Sakshi

సింగరేణి కీర్తిని చాటాలి

ర్మికులు క్రీడాపోటీల్లో నైపుణ్యం ప్రదర్శించి సింగరేణి కీర్తిని చాటాలని ఆర్జీ-1 సీజీ ఎం కె.సుగుణాకర్‌రెడ్డి అన్నారు.

 సింగరేణి కీర్తిని చాటాలి
 గోదావరిఖని :
 కార్మికులు క్రీడాపోటీల్లో నైపుణ్యం ప్రదర్శించి సింగరేణి కీర్తిని చాటాలని ఆర్జీ-1 సీజీ ఎం కె.సుగుణాకర్‌రెడ్డి అన్నారు.
 వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన కంపెనీ స్థాయి హాకీ పోటీలను ప్రారంభించిన అనంత రం ఆయన మాట్లాడారు.
  ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 26వ తేదీన జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే కోల్‌ఇండియా ఇంటర్ కంపెనీ హాకీ పోటీలకు ఎంపిక చేస్తామ ని చెప్పారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కె.ప్రకాశ్‌బాబు, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యద ర్శి రియాజ్‌అహ్మద్, యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, స్పోర్ట్స్ ఆఫీసర్ రాజకొమురయ్య, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ రాజనారాయణరెడ్డి, స్పోర్ట్స్ కార్యదర్శి అరవిందరావు, కో-ఆర్డినేట ర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు అశోక్, పాపనాయక్, జాన్ వెస్లీ, రమేశ్ పాల్గొన్నారు.
 హోరాహోరీగా పోటీలు
 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొద ట కొత్తగూడెం-శ్రీరాంపూర్ జట్లు తలపడగా 0-3 పాయింట్లతో శ్రీరాంపూర్ గెలిచింది. రెండవ మ్యాచ్‌లో ఆర్జీ-1, 2తో మందమర్రి, బెల్లంపల్లి జట్టు తలపడగా 0-1 పాయింట్‌తో ఆర్జీ-1, 2 విజయం సాధించింది. మధ్యాహ్నం కొత్తగూడెం కార్పొరేట్- భూపాలపల్లి, ఆర్జీ-3 జట్ల మధ్య జరిగిన పోటీలో 1-7 పాయింట్లతో భూపాలపల్లి, ఆర్జీ-3 విజయాన్ని దక్కించుకుం ది. బెల్లంపల్లి, మందమర్రి-మణుగూరు, ఇల్లెం దు జట్ల మధ్య జరిగిన పోటీలో బెల్లంపల్లి, మందమర్రి జట్టు 2-1 పాయింట్లతో గెలుపొం దింది. మంగళవారం ఆర్జీ-1, 2-మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, ఆర్జీ3-శ్రీరాంపూర్ జట్లు సెమీ ఫైనల్ ఆడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement