ముగిసిన చక్రపాణి పదవీకాలం | Ended Chakrapani tenure as state legislative chairman | Sakshi
Sakshi News home page

ముగిసిన చక్రపాణి పదవీకాలం

May 28 2017 1:25 AM | Updated on Sep 5 2017 12:09 PM

రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి ఎమ్మెల్సీ పదవీకాలం శనివారంతో ముగిసింది.

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి ఎమ్మెల్సీ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2011లో గవర్నర్‌ కోటాలో ఎంపికై రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వారిలో చక్రపాణి, చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డెప్పరెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి పదవీ కాలం శనివారంతో ముగిసింది.

దీంతో వీరి స్థానంలో కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీలు గవర్నర్‌ కోటాలో నియమితులు కావాల్సి ఉంది. అలాగే మండలి చైర్మన్‌ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement