గ్యాస్‌తో అధార్ అనుసంధానానికి 14వరకే గడువు | Due to connect up to 14 gas adhar | Sakshi
Sakshi News home page

గ్యాస్‌తో అధార్ అనుసంధానానికి 14వరకే గడువు

Feb 8 2015 6:37 AM | Updated on Sep 2 2017 9:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాల్లో వంటగ్యాస్ కోసం బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్ అనుసంధానానికి గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుంది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాల్లో వంటగ్యాస్ కోసం బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్ అనుసంధానానికి గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుంది. తర్వాత కూడా అనుసంధానం చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఈ గడువులోగా అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ సిలిండర్ల సరఫరా తాత్కాలికంగా ఆగిపోతుంది.

ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఈనెల 15వ తేదీ నుంచి రాయితీ లేకుండా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో నవంబరు నుంచి నగదు బదిలీ అమలులోకి వచ్చింది. ఈనెల 15 నుంచి ఈ జిలాల్లోని వినియోగదారులు పూర్తి మొత్తం చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాలి. రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో జమ అవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement