ఎస్‌ఆర్‌ఎమ్‌ వర్సిటీ వీసీగా ‘జంషెడ్‌ బారుచా’

Dr Jamshed Bharucha Appointed As Vice Chancellor Of SRM University Amaravati - Sakshi

సాక్షి, అమరావతి : ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనిర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ జంషెడ్‌ బారుచా నియమితులయ్యారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శీటీ వ్యవస్థాపక వైస్‌ చాన్సలర్‌గా ఆయన కొనసాగనున్నారు. ఆయన గతంలో అమెరికాకు చెందిన పలు ప్రముఖ విద్యాసంస్థలలో ఉన్నత పదవులలో కొనసాగారు.

ఎస్‌ఆర్‌ఎమ్‌ విద్యాసంస్థల అధినేత పి. సత్యనారాయణన్‌ మాట్లాడుతూ.. యూనివర్శిటీ, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన ఎల్లవేళలా కృషి చేయగలరని ఆకాక్షించారు. జంషెడ్‌ బారుచాను అమరావతి ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా నియమించటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జంషెడ్‌ బారుచా మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి అన్ని రకాలుగా కృషిచేయాలని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. శక్తివంచన లేకుండా విద్యార్థులకు సహకరించటమే కాకుండా.. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top