పదహారుమందిని కరిచేశాయి | Dog bites, 16 injured | Sakshi
Sakshi News home page

పదహారుమందిని కరిచేశాయి

Jun 23 2015 3:45 PM | Updated on Sep 29 2018 4:26 PM

ప్రకాశం జిల్లా పొదిలిలో పిచ్చి కుక్కల దాడిలో 16 మందికి గాయాలయ్యాయి.

పొదిలి :  ప్రకాశం జిల్లా పొదిలిలో పిచ్చి కుక్కల దాడిలో 16 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పొదిలి మేజర్ పంచాయతీ పరిధిలోని పొదిలి పట్టణంతోపాటు రాజుపాలెంలో మూడు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిపై దాడి చేశాయి. వీటి దాడిలో 16 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలులోని రిమ్స్‌కు, మిగిలిన వారిని పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మూడు పిచ్చి కుక్కల్లో ఒక దానిని స్థానికులు కొట్టి చంపగా మిగతా రెండూ తప్పించుకుపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement