వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి | Doctor Ramireddy quits TDP, joins YSR congress party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి

Nov 18 2017 1:56 PM | Updated on Aug 10 2018 8:31 PM

Doctor Ramireddy quits TDP, joins YSR congress party - Sakshi

సాక్షి, బనగానపల్లె : కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ రామిరెడ్డి సహా పలువురు కీలక నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లమెట్ట వద్ద వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సమక్షంలో శనివారం సుమారు 50మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరగా, వారందరినీ జగన్‌... సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

రామిరెడ్డితో పాటుగా కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దూరు రామసుబ్బారెడ్డి, అలాగే బనగానపల్లె మండలం కైఫా గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నడిపెన్న, మహేష్ తో పాటు పలువురు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement