'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్' | DL Ravindra Reddy lashes out at Kirankumar Reddy | Sakshi
Sakshi News home page

'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్'

Feb 5 2014 7:20 PM | Updated on Jul 29 2019 5:28 PM

'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్' - Sakshi

'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసమర్థుడు, అవినీతి పరున్ని ముఖ్యమంత్రిని చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని డీఎల్ విమర్శించారు.

కిరణ్ పిరికివాడు, అసమర్థుడని దుయ్యబట్టారు. ఆయన కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదని డీఎల్ అన్నారు. సీఎం పార్టీ పెడితే పది లక్షల రూపాయిలు విరాళం ఇస్తానని డీఎల్ సవాల్ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement