పాలమూరులో ప్రబలిన అతిసార | diarrhea in mahaboonagar district | Sakshi
Sakshi News home page

పాలమూరులో ప్రబలిన అతిసార

Aug 16 2013 11:00 AM | Updated on Oct 8 2018 5:04 PM

పాలమూరు జిల్లా వ్యాప్తంగా అతిసార విజృంభించింది. దాంతో నర్వ మండలం పాతర్చేడ్లో శుక్రవారం ఒకరు మృతి చెందారు.

పాలమూరు జిల్లా వ్యాప్తంగా అతిసార విజృంభించింది. దాంతో నర్వ మండలం పాతర్చేడ్లో శుక్రవారం ఒకరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మక్తల్ మండలం చిట్యాలలో కూడా అతిసార ప్రబలింది. దీంతో 70 ఆసుపత్రి పాలు అయ్యారు. వారందరిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారి పట్ల ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నిమ్మకునిరెత్తినట్లు వ్యహరిస్తుండటంతో రోగులు తీవ్ర వేదన చెందుతున్నారు. అయితే జిల్లాకు ఉన్నతాధికారుల కానీ వైద్యాధికారులు అతిసార ప్రబలిన ప్రాంతాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement