కరోనా వైరస్‌పై మంత్రి నాని సమీక్ష..

Deputy CM Alla Nani Review Meeting Over Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా  కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు.

కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోధన ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 5 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రతి ఆస్పత్రిలో కూడా వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌పై తక్షణమే ప్రత్యేక నోడలు అధికారిని నియమించాలన్నారు. 

చదవండి : చైనా నుంచి వచ్చిన రాయచోటి విద్యార్థిని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top