వరదనీటిలో బయటపడ్డ మృతదేహం | Dead body Found in Flood water | Sakshi
Sakshi News home page

వరదనీటిలో బయటపడ్డ మృతదేహం

Nov 19 2015 9:57 AM | Updated on Aug 1 2018 3:59 PM

చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని లక్ష్మిపురం కూడలి వద్ద పెద్ద కాలువలో ఓ వృద్ధుడి మృతదేహం బయటపడింది.

చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని లక్ష్మిపురం కూడలి వద్ద పెద్ద కాలువలో ఓ వృద్ధుడి మృతదేహం బయటపడింది. మృతుడు మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన చిన్నగుత్తిగల్లు మండలం గుట్టదిండివారిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామానాయుడు(72)గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే రామానాయుడు కనిపించటంలేదని కుమారుడు శేఖర్ తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. కుమారుడి ఇంటి నుంచి స్వగ్రామం గుట్టదిండివారిపల్లి వెళ్లే సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement