దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి | Dalit will be appointed as Chief minister for Telangana | Sakshi
Sakshi News home page

దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి

Dec 16 2013 7:06 AM | Updated on Sep 2 2017 1:41 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దళితుడినే ముఖ్యమంత్రి చేయాలని నేతకాని విద్యార్థి సంఘం(ఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర నాయకుడు అనపర్తి యువరాజ్ డిమాండ్ చేశారు.

కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దళితుడినే ముఖ్యమంత్రి చేయాలని నేతకాని విద్యార్థి సంఘం(ఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర నాయకుడు అనపర్తి యువరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన నేతకాని విద్యార్థి సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.
 
 తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ ఆధీనంలోనే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందిచాలని అన్నారు. వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు మెస్ చార్జీలు పెంచాలని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేసే వారి కోసం స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరరు. నిరుద్యోగులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందజేయాలని, భృతి చెల్లించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్టల్ విద్యార్థులకు వెంటనే దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జుమిడి గోపాల్, ప్రధాన కార్యదర్శి దుర్గం గణపతి, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు మేడి చరణ్‌దాస్, గంధం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement