తుఫాను ప్రభావం: శ్రీకాకుళంలో వర్షాలు ప్రారంభం | cyclone hudhud effect starts, rains in srikakulam | Sakshi
Sakshi News home page

తుఫాను ప్రభావం: శ్రీకాకుళంలో వర్షాలు ప్రారంభం

Oct 11 2014 1:05 PM | Updated on Sep 2 2017 2:41 PM

హుదూద్ తుఫాను ప్రభావం మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి.

హుదూద్ తుఫాను ప్రభావం మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న తుంపర్లు వస్తుండగా మరికొన్ని గ్రామాల్లో పెద్ద వర్షమే కురుస్తోందని సమాచారం. ఇక తుఫాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. మొత్తం 64 మండలాల పరిధిలోని 5.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తక్షణం తరలించాలని ఆదేశించారు. మొత్తం 370 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం 54 బోట్లతో 689 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మొత్తం 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement