టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు | cpi, ysrcp appeal to collector against TDP leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు

Feb 6 2015 10:07 PM | Updated on Aug 13 2018 8:10 PM

అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం నేతల తీరుపై వైఎస్సార్సీపీ, సీపీఎం మున్సిపల్ కౌన్సిలర్టు జిల్లా కలెక్టర్ కోన శశిధర్కు విజ్ఞప్తి చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం నేతల తీరుపై వైఎస్సార్సీపీ, సీపీఎం మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్కు ఫిర్యాదు చేశారు. హిందూపురంలో టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

కౌన్సిల్ సమావేశాల్లో తమపై దాడులకు దిగుతున్నారని, పర్సెంటేజీల పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.


 

Advertisement
 
Advertisement
Advertisement