ఆయన మా పార్టీలో లేరు: వైఎస్సార్‌ సీపీ | CK Babu is not our member: YSR Congress Party | Sakshi
Sakshi News home page

ఆయన మా పార్టీలో లేరు: వైఎస్సార్‌ సీపీ

Sep 19 2017 4:05 PM | Updated on May 25 2018 9:20 PM

ఆయన మా పార్టీలో లేరు: వైఎస్సార్‌ సీపీ - Sakshi

ఆయన మా పార్టీలో లేరు: వైఎస్సార్‌ సీపీ

చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరని వైఎస్సార్‌ సీపీ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌ : చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరని వైఎస్సార్‌ సీపీ తెలిపింది. పార్టీతో వారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

సీకే బాబు కుటుంబ సభ్యులు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము వైఎస్సార్‌ సీపీలో ఉన్నామంటూ.. పార్టీ సీనియర్‌ నాయకులు, ఇతర నేతలను నిందించారు. ఇవన్నీ పార్టీ నాయకత్వం దృష్టికి రావడంతో సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరన్న విషయాన్ని వైఎస్సార్‌ సీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement