బాబూ.. దొంగదీక్షలు ఎందుకు..?

Chandrababu Started New Drama In The Special Category - Sakshi

రైల్వేకోడూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి చద్రబాబునాయుడు  ప్రత్యేకహోదా విషయంలో తీరని ద్రోహం చేసి ఇప్పుడు దొంగదీక్షలు చేయడం ఎం దుకని, హోదా రాకుండా ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి నాటకాలు ఆడుతున్నారని గురువారం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ముద్దా బాబుల్‌రెడ్డిలు ప్రశ్నించారు. స్థానిక పార్టీ క్యాలయంలో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రజలను నాలుగేళ్లుగా మోసగించి, హోదా ఉద్యమాన్ని నీరుగార్చారని, ప్రజల ఆగ్రహాన్ని చూసిన తరువాత ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి నానాతంటాలు పడుతున్నాడని విమర్శించారు. ఇప్పుడు ప్రతిరోజు  హడావుడి చేస్తున్న చంద్రబాబు కొత్త నాటకాలు మొదలు పెట్టారని అన్నారు.

వైసీపీ ఏంపీలు డిల్లీలో ఆమరణ దీక్షలు చేస్తే దీక్షలతో హోదా వస్తుందా అన్న చంద్రబాబు ఇప్పుడు దొంగదీక్షలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టిన రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, కానీ చంద్రబాబు పుట్టినరోజు దొంగదీక్షలు చేయడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ పోరాడుతూ ఉండకపోతే ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎప్పుడో తొక్కేసేవారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి పంజంసుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, మండలాల కన్వీనర్‌లు  జీ. సుధాకర్‌రాజు, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణకన్వీనర్‌ సీహెచ్‌ రమేష్‌బాబు, నియోజకవర్గ అధికార ప్రతినిది మందల నాగేంద్ర, జిల్లాబీసీసెల్‌ప్రధాన కార్యదర్శి యనమాల మహేష్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top