ప్రత్యేక ప్యాకేజీకి విజ్ఞప్తి చేశాం: చంద్రబాబు | chandrababu naidu meets narendra modi, cabinet ministers | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ప్యాకేజీకి విజ్ఞప్తి చేశాం: చంద్రబాబు

Jan 16 2015 7:26 AM | Updated on Aug 21 2018 9:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన గురువారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని హస్తినలో బిజీ బిజీగా ఉన్నారు.  ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన గురువారం భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు ప్రస్తావించారు. నవ్యాంధ్రకు న్యాయం చేయాలంటూ విన్నవించారు. పోలవరం ప్రాజెక్ట్, కృష్ణాజలాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా.. స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెండానికి మరింత ఆస్కారం ఉంటుందని... కాబట్టి వీలైనంత త్వరగా ఈ తంతు పూర్తి చేయాలని ప్రధానిని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీలను నెరవేర్చాలని కోరామని, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement