చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత | No clarity on chandrababu naidu delhi tour | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత

Jun 25 2014 10:54 AM | Updated on Aug 15 2018 2:20 PM

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత - Sakshi

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత నెలకొంది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై అస్పష్టత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కానున్నట్లు సమాచారం. దాంతో ఆయన పర్యటనపై స్పష్టత రావల్సి ఉంది. కాగా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాట స్పెషల్ ప్యాకేజీ, కృష్ణా జలాలు, పోలవరం ప్రాజెక్ట్ తదితర అంశాలపై చర్చించనున్నారు.  రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు ఇతర అంశాలపై కేంద్రంతో మాట్లాడేందుకు ఈనెల 26న ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement