ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తా.. | Chandrababu comments at the meeting of Muslims | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..

Aug 21 2017 3:11 AM | Updated on Oct 19 2018 8:10 PM

ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తా.. - Sakshi

ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..

నంద్యాల నియోజకవర్గంలోని మైనారిటీలకు తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

- నంద్యాల మైనారిటీలకు అండగా ఉంటా..
ముస్లింల సమావేశంలో సీఎం బాబు
 
సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల నియోజకవర్గంలోని మైనారిటీలకు తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లింలతో ఆయన సమావేశం నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక మైనారిటీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టానన్నారు. అభివృద్ధి చేయడం తన ఒక్కరితోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలపించాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో ముస్లింలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోగా, రాష్ట్ర  మంత్రివర్గం లోనూ చోటు కల్పించకపోవడం పట్ల సమావేశంలో పాల్గొన్న ఆ వర్గం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
రుణమాఫీ చేశా.. ఓట్లు వేయండి 
తాను అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను మాఫీ చేశానని, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలను కోరారు. ఆయన ఆదివారం నంద్యాలలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement