
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో తాజా పరిణామాలపై చర్చించారు.
ఇంగ్లిష్ మీడియం విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్ని అడ్డుకుంటున్నామనే భావన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఏర్పడిందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనకు టీడీపీ వ్యతిరేకం కాదని, దానిని ప్రవేశపెట్టింది టీడీపీయేనని ప్రచారం చేయాలని సూచించారు.