'ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య బాధాకరం' | chandra babu naidu will go to delhi very soon for special status, says ke krishna murthy | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య బాధాకరం'

Aug 9 2015 2:46 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఏపీ ప్రత్యేక హోదా కోసం తిరుపతి యువకుడి ఆత్మహత్య బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం తిరుపతి యువకుడి ఆత్మహత్య బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని.. త్వరలోనే ఈ అంశంపై ఢిల్లీకి వెళ్తారన్నారు.
 

ఏఐసీసీ సోనియా గాంధీ దగ్గర మోకరిల్లి రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేతలేనని కేఈ విమర్శించారు. అటువంటి కాంగ్రెస్ నేతల తమపై విమర్శలు చేయడం తగదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement