'వైఎస్‌ జగన్‌ ఒక డైనమిక్‌ లీడర్‌'

Challa Ramakrishna Reddy Admired About YS Jagan Mohan Reddy Ruling In Kurnool - Sakshi

చల్లా రామకృష్ణా రెడ్డి

సాక్షి,కర్నూలు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మూడు నెలల్లోనే ఆచరణలో పెట్టి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే డైనమిక్‌ లీడర్‌గా పేరు సంపాదించారని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో దశల వారిగా అమలు చేస్తున్న మద్యపాన నిషేధం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడగలిగారని తెలిపారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి కేవలం ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తే, సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం పగటిపూటే తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించారు. నిరక్ష్యరాస్యతను తగ్గించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్‌ జగన్‌ తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా గుర్తించి సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top