వివాహితకు సెల్‌ షాపు యజమాని బ్లాక్‌మెయిల్‌ | Cell Shop Owner Blackmail Married Woman | Sakshi
Sakshi News home page

వివాహితకు సెల్‌ షాపు యజమాని బ్లాక్‌మెయిల్‌

Oct 13 2018 12:09 PM | Updated on Oct 13 2018 12:09 PM

Cell Shop Owner Blackmail Married Woman - Sakshi

నిడదవోలు : పట్టణంలోని గణేష్‌ చౌక్‌ సెంటర్‌ ఉన్న సిరి సెల్‌షాపు యజమాని పి.శేఖర్‌ ఓ వివాహితను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండటంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఏస్సై జి.సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాటి మీద సెంటర్‌కు చెందిన యువతికి ఈ ఏడాది మార్చిలో వివాహమైంది. ఆమె ప్రస్తుతం భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. ఆమె ఫొటోలు తన దగ్గర ఉన్నాయని, తనకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని శేఖర్‌ ఆ వివాహితను, ఆమె కుటుంబ సభ్యులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా ఆ వివాహిత తల్లి ఇంటికి వెళ్లి బెదిరించడం ప్రారంభించాడు.  దీంతో వివాహిత తల్లి, శేఖర్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఆ తల్లిపై దాడి చేసి కొట్టి వెళ్లిపోయాడు. వివాహిత తల్లిదండ్రులు, బంధువులు సుమారు 20 మంది మహిళలు సెల్‌షాపును చుట్టుముట్టారు. షాపు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో శేఖర్‌ పరారయ్యాడు. వివాహిత తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement