‘విశాఖను డ్రగ్స్‌ సిటీగా మార్చాలని చూస్తున్నారు’ | Bjp Vishnu Kumar Raju On Rave Party In Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘విశాఖను డ్రగ్స్‌ సిటీగా మార్చాలని చూస్తున్నారు’

May 6 2019 2:46 PM | Updated on May 6 2019 2:46 PM

Bjp Vishnu Kumar Raju On Rave Party In Visakhapatnam - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి : విశాఖలో జరిగిన రేవ్‌పార్టీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు మాట్లాడుతూ.. దీని వెనుక మంత్రి ఘంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోమ్‌ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. విశాఖను డ్రగ్స్‌ సిటీగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవ్‌ పార్టీలో మత్తు పదార్థాలను వాడారని అన్నారు.

ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ లైసెన్స్‌లు తీసుకున్నారని విమర్శించారు. విశాఖకు చెందిన మంత్రి పేషీ నుంచి 8సార్లు ఫోన్‌ చేశారని​ అన్నారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్‌ చేసి ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ మంత్రే కాబట్టి సీఎం మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ నార్త్‌లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం అనవసరంగా మోదీపై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎంకు అసహనం ఎక్కవైపోతోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement