ఉద్దానాన్ని వణికిస్తున్న ఎలుగులు | Bears Attacks in Srikakulam District | Sakshi
Sakshi News home page

ఉద్దానాన్ని వణికిస్తున్న ఎలుగులు

Jan 11 2020 12:58 PM | Updated on Jan 11 2020 12:58 PM

Bears Attacks in Srikakulam District - Sakshi

చిన కొత్తూరులో సంచరిస్తున్న ఎలుగు

శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు రూరల్‌: ఉద్దాన, తీర ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తూ ప్రజలను వణికిస్తున్నాయి. అక్కుపల్లి, గుణుపల్లి, బాతుపురం, మోట్టూరు, చినవంక, చినకొత్తూరు, తోటూరు, డోకులపాడు, రాజాం, కిడిసింగి తదితర గ్రామాల్లో రేయింబవళ్లు అని తేడా లేకుండా గ్రామాల్లో సంచరించడంతో భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎలుగుల దాడిలో మృతి చెందారని వాపోతున్నారు. దీంతో తమ జీవనాధరమైన జీడి తోటలకు వెళ్లేందుకు జంకుతున్నారు.  రాత్రిళ్లు కూడా గ్రామ వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement