‘గ్రామ వాలంటీర్లు అంకితభావంతో పనిచేయాలి’

Avanthi Srinivasa Rao Speech In Visakhapatnam District - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని దేవరాపల్లిలో నలబై లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్థి కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ బీశెట్టి సత్యవతి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వరగడం చిన అప్పలనాయుడు, కిలపర్తి భాస్కరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతోపాటు జిల్లాలోని చోడవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి గ్రామ వాలంటీర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు అంకితభావంతో  పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top