ఆరోపణలపై అశోక్‌బాబు వివరణ

Ashok Babu responds on karnataka election campaign issue - Sakshi

సాక్షి, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి అనుకూలం కాదంటూనే తెలుగుదేశం పార్టీని అశోక్‌బాబు వెనకేసుకొచ్చారు. చంద్రబాబు పరిపాలనకు ఇబ్బందొస్తుందని ఉద్యమాలు చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ పాలన బీజేపీ,  నాన్‌ బీజేపీ అన్న విధానంలో నడుస్తోందని పేర్కొన్నారు. టీడీపీ తరపున బెంగళూరు పర్యటనకు వెళ్లలేదని తెలిపారు. ఏపీ హక్కుల సాధన సమితి నుంచి 150 మంది వెళ్లామన్నారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అశోక్‌బాబు ప్రకటించారు.

కాగా,  అశోక్‌బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్‌కు వేయాలని  సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్‌ఫీల్డ్‌ రోడ్డులోని ఒక హోటల్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top