సీఎంకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా? | Aryavaisyas fires on CM | Sakshi
Sakshi News home page

సీఎంకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా?

Apr 26 2016 3:08 AM | Updated on Aug 20 2018 5:04 PM

రాష్ట్రంలోని కులాలను విడగొట్టి వారికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా అంటూ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు

 కల్లూరు: రాష్ట్రంలోని కులాలను విడగొట్టి వారికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులు గుర్తుకు రాలేదా అంటూ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కల్లూరులో నిర్వహించిన శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరిదేవి మహా కుంభాభిషేక వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. ఆయన ఇచ్చిన మాట మేరకు వెంటనే ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి, వెయ్యి కోట్ల రూపాయలతో కమిషన్ ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు. హామీ నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భవిష్యత్ ఉండదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement