
ఆదివారం నెల్లూరు జిల్లా కసుమూరు దర్గాలో జరుగుతున్న ప్రార్థనల్లో ఏఆర్ రహమాన్
వెంకటాచలం: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాను దర్శించుకున్నారు. ఏటా జరిగే కసుమూరు దర్గా గంధోత్సవంలో కొన్నేళ్ల నుంచి రహమాన్ పాల్గొంటున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఏఆర్ రహమాన్ తన కుమారుడు అమీన్‌తో కలిసి దర్గా వద్దకు చేరుకున్నారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లాహుస్సేనీ మస్తాన్‌వలీ సమాధిపై చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసే సమయంలోనే ఏఆర్ రహమాన్ ప్రార్థనలు చేశారు.