కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనడానికి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.
- ఏపీ ఎమ్మెల్సీ ఫలితాలపై ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనడానికి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.
బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు పట్ల ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో, మేధావులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగిందని చెప్పారు.