బీపీఎల్‌ కుటుంబాలకు ఆర్థిక సాయం

AP Government Passed Guidelines To Help BPL Families - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రిలో చికిత్స అనంతరం బీపీఎల్‌ కుటుంబాలకు చెల్లించే ఆర్థిక సాయంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్ర చికిత్సలకు ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ. 5వేలు చెల్లించేందుకు ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులో పేర్కొంది.

కాగా, డిసెంబరు 1వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స అనంతరం బీపీఎల్‌ కుటుంబాలకు వైద్యారోగ్యశాఖ ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నేపథ్యంలో చికిత్స చేయించుకున్న రోగులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌ కార్డు సహా ఇతర వివరాలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top