
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూపురేఖలు మారిపోనున్నాయి. నగరాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సిటీ స్వరూపం మార్చేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన జీఓను కూడా సర్కారు విడుదల చేసింది. ప్రధానంగా రోడ్ల అభివృద్ధితోపాటు నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. క్రీడా సౌకర్యాలు మెరుగుపర్చడం.. సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాన్లను ఏర్పాటుచేయడం.. పార్కుల అభివృద్ధి.. మున్సిపల్ పాఠశాలల్లో సౌకర్యాలు, సీసీ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. అలాగే, నగర వాసులను ఎంతగానో అలరిస్తున్న ఫుడ్‌కోర్టు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రహదారిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ఇవేకాక.. మరిన్ని కార్యక్రమాల రూపకల్పనకు కూడా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు.
డివిజన్ల సంఖ్య పెంపు
అలాగే, నగరంలోని డివిజన్ల సంఖ్య కూడా పెరగనుంది. 1981లో బెజవాడ పురపాలక సంఘం విజయవాడ నగరపాలక సంస్థగా మారింది. అప్పట్లో నగరంలో 40 డివిజన్లు ఉండేవి. ఆ తర్వాత పునరి్వభజనతో అవి 44కు పెరిగాయి. అనంతరం 59 అయ్యాయి. తాజాగా, మరోసారి డివిజన్ల పునరి్వభజన చేయాలని సర్కారు నిర్ణయించడంతో ఆ సంఖ్య 64కు చేరుకునే అవకాశం ఉంది. పురపాలక శాఖ ఆదేశాల మేరకు నగర జనాభాకు అనుగుణంగా ఈ డివిజన్ల పునరి్వభజన జరగనుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా 13.60 లక్షలు ఉన్నా.. 2011 జనాభా (10.45 లక్షలు) లెక్కల ప్రకారమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డివిజన్ల పునరి్వభజన ముసాయిదాను సిద్ధంచేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది డివిజన్ల స్వరూప జాబితాను ప్రకటించనున్నారు.
ప్రస్తుత నగర స్వరూపం ఇదీ..