అర్ధరాత్రి నుంచి ఏపీ ప్రైవేట్ బస్సులు నిలిపివేత | Andhra Pradesh private vehicles to be stopped from midnight | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నుంచి ఏపీ ప్రైవేట్ బస్సులు నిలిపివేత

Mar 31 2015 3:39 PM | Updated on Aug 18 2018 4:13 PM

అర్ధరాత్రి నుంచి ఏపీ ప్రైవేట్ బస్సులు నిలిపివేత - Sakshi

అర్ధరాత్రి నుంచి ఏపీ ప్రైవేట్ బస్సులు నిలిపివేత

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి. ఈ రోజు అర్థ రాత్రి నుంచి దాదాపు 80 శాతం బస్సులు నిలిపివేయనున్నారు.

ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్ను వసూలు చేయనున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు సమావేశమై.. బస్సులు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పన్ను ఆలోచన విరమించుకొండి: శిద్దా రాఘవరావు
ఏపీ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను విధించే ఆలోచనని విరమించుకోవాలని రోడ్లు, భవనాలు, రవాణ  శాఖమంత్రి శిద్దా రాఘవరావు తెలంగాణ సర్కారుని కోరారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అటు ఆంధ్రా ప్రాంతానికి కూడా వ్యాపారం, పుణ్య క్షేత్రాల సందర్శరార్థం  పెద్ద ఎత్తున తెలంగాణ వాహనాలు వస్తాయన్నారు. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాలు కలిస్తే ఎవరిపైనా ఆర్ధిక భారం లేకుండా ఉంటుందని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement