అనంతలో షూటింగ్ సందడి | anathapuram in shooting noise | Sakshi
Sakshi News home page

అనంతలో షూటింగ్ సందడి

Jun 3 2016 2:54 AM | Updated on Sep 4 2017 1:30 AM

అనంతలో షూటింగ్ సందడి

అనంతలో షూటింగ్ సందడి

ప్రత్యక్షదైవం షిరిడీ సాయిబాబా’ సినిమా షూటింగ్ నగరంలోని పలుచోట్ల సందడిగా జరిగింది.

అనంతపురం కల్చరల్:  ‘ప్రత్యక్షదైవం షిరిడీ సాయిబాబా’ సినిమా షూటింగ్ నగరంలోని పలుచోట్ల సందడిగా జరిగింది. గురువారం ఉదయం  స్థానిక మూడో రోడ్డులోని  సాయిబాబా మందిరంలో చిత్రంలోని ఓ  పాటను ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించారు. రాష్ట్ర ఒలపింక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో  చిత్ర దర్శకుడు కొండవీటి సత్యం, మచ్చా రామలింగారెడ్డి తదితరులు చిత్ర విశేషాలు తెలియజేశారు.

శ్రీ దత్త క్రియేషన్ బ్యానర్‌పై ఈ చిత్రం  తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణమవుతోందన్నారు.  స్థానిక కళాకారులకు అవకాశమివ్వడం కోసం అనంతలో చిత్ర షూటింగ్ జరిపామన్నారు.  3,4 తేదీల్లో పెన్నోహబిళం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని, జూలైలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు గంగిరెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి, సీనియర్ నటులు కొండయ్య, తరిమెల రాజు, వన్నూర్‌కుమార్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement