ఇసుక పోటు | AE due to a shortage of sand in the district office | Sakshi
Sakshi News home page

ఇసుక పోటు

Oct 20 2013 4:06 AM | Updated on Sep 1 2017 11:47 PM

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏఈ కార్యాలయాలకు ఇసుకదెబ్బ తగిలింది. ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఏఈ కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు.

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఏఈ కార్యాలయాలకు ఇసుకదెబ్బ తగిలింది. ఇసుక కొరత కారణంగా జిల్లాలో ఏఈ కార్యాలయాల నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. జులై నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలని భావించినా ఇసుక దొరక్కపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. దీనికితోడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసోత్సవాలు కూడా పనులకు అడ్డంకిగా మారాయి. దీంతో ఆ నెలరోజుల పాటు నిర్మాణపనులు నిలిచి పోయినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొన్ని మండలాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలభావం కూడా ఓ సమస్యగా మారింది. జిల్లాలో ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. జిల్లాలో 64 మండలాలకు ఒక్కో ఏఈ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. ముందుగా 55 మండలాల్లో ఈ కార్యాలయాలను నిర్మిం చేందుకు జిల్లా అధికారులు పనులు చేపట్టి..ఇప్పటివరకు 36 కార్యాలయాల నిర్మాణపనులు పూర్తిచేశారు. ఇంకా 19 కార్యాలయ భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొన్ని స్థలాలు లేక నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. హన్వాడ మండలంలో స్థలం లేక నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. చాలాచోట్ల బేస్ లెవల్, లెంటల్ లెవెల్ వరకు వచ్చి ఇసుక కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి.
 
 ప్రజలకు మరింత చేరువలో..
 సేవలు ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రతి మండలానికి ఒక ఏఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా మండలాల్లో ప్రత్యేకించి ఈ శాఖకు కార్యాలయం లేకపోవడంతో గ్రామీణప్రాంత లబ్ధిదారులు ఇబ్బందులు పడేశారు. బిల్లుల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలిసేదికాదు. వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి మండలంలో ఏఈ కార్యాల యాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకో సం జిల్లాకు రూ.1.30కోట్లు మంజూరయ్యాయి. ఇందిరా ఆవాస్ పథకం ద్వారా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 గజాలు, 20/20 వ్యాసార్థం గల స్థలంలో రెండు రూమ్‌లతో కూ డిన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండాలో ప్రజల కు తెలియజెప్పేందుకు మాడల్ ఈ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు.
 
 ఒక్కో కార్యాలయాన్ని రూ.2.20 లక్షలతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. దీంతో పాటు ఫర్నీచర్ ఏర్పాటుకోసం రూ.20 లక్షలు మంజురు చేయనున్నారు. ప్రతి కార్యాలయానికి రూ.30వేల చొప్పన కేటాయించనున్నారు. గృహ నిర్మాణశాఖ ద్వారా లబ్ధిదారులు ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియజేసేం దుకు ఈ ఇళ్లకు మాడల్‌గా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. 70 గజాల స్థలంలో ఎలా నిర్మించుకోవాలో ప్రజల కు తెలియజేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement