కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB attacks on Corporation Building Inspector | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Nov 9 2015 3:47 PM | Updated on Oct 20 2018 6:19 PM

ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు రావడంతో నెల్లూరు బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ పి.కృష్ణయ్య ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది.

నెల్లూరు నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి. కృష్ణయ్య ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహించారు. నెల్లూరులో ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరి, బెంగుళూరులోని ఆయన సమీప బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



 

Advertisement
 
Advertisement
Advertisement