breaking news
building inspector
-
ఏసీబీకి చిక్కిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్
నంద్యాల (కర్నూలు జిల్లా) : నంద్యాల మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కమాల్ హుస్సేన్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కాడు. సంపత్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి హుస్సేన్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి. కృష్ణయ్య ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు నిర్వహించారు. నెల్లూరులో ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన ఆస్తుల వివరాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్గిరి, బెంగుళూరులోని ఆయన సమీప బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.