ఏసీబీకి చిక్కిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ | Building inspector caught taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్

Dec 1 2015 3:53 PM | Updated on Aug 17 2018 12:56 PM

నంద్యాల మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కమాల్ హుస్సేన్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కాడు.

నంద్యాల (కర్నూలు జిల్లా) : నంద్యాల మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కమాల్ హుస్సేన్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కాడు. సంపత్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి హుస్సేన్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement