బావిలో మృతదేహం లభ్యం | A man died with family problems | Sakshi
Sakshi News home page

బావిలో మృతదేహం లభ్యం

Sep 29 2015 9:42 PM | Updated on Sep 3 2017 10:11 AM

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కంబదురు(అనంతపురం): కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాజశేఖర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ రోజు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల కిందటే దూకి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement