Corona Cases in AP: in Last 24 Hours, 376 New Positive Cases are Reported in Andhra Pradesh - Sakshi Telugu
Sakshi News home page

ఏపీలో మరో 376 కరోనా కేసులు

Jun 19 2020 2:54 PM | Updated on Jun 19 2020 5:05 PM

376 New Corona Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6230కు చేరుకుంది. తాజాగా 17,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 82 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, నలుగురు మరణించారు.దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 96కు చేరింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 3065 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 3069 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే)

Advertisement
 
Advertisement
Advertisement